Home  »  TV News  »  స్విమ్మింగ్ వచ్చని మురారికి అబద్ధం చెప్పిన కృష్ణ! 

Updated : Jun 30, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -196 లో.. ముకుంద ఉన్న గది ముందు చెప్పులు ఉండడంతో కృష్ణకి డౌట్ వస్తుంది. లోపల ఎవరో ఉన్నారని అదే విషయం భోజనం చెయ్యడానికి కూర్చున్న మురారిని కృష్ణ అడుగుతుంది. ఏసీపీ సర్ ఇక్కడ మనం కాకుండ ఎవరో ఉన్నారని అనగానే.. ముకుంద నే వచ్చి ఉంటుందని మురారి టెన్షన్ పడతాడు. కృష్ణ ని ఆ మ్యాటర్ నుండి డైవర్ట్ చెయ్యడానికి ట్రై చేస్తాడు మురారి. కృష్ణ మాత్రం అటు తిరిగి ఇటు తిరిగి ఎవరో ఉన్నారని అంటుంది. ఎవరు లేరు నువ్వు ముందు భోజనం చెయమని కృష్ణకి అన్నం తినిపిస్తాడు మురారి.

కాసేపటికి రాజనర్స్ దగ్గరికి మురారి వస్తాడు. ఇక్కడ మనం కాకుండ ఇంకా ఎవరైనా ఉన్నారా అని మురారి అడుగుతాడు. రాజనర్స్ టెన్షన్ గా నిజం చెప్పకూడదని మనసులో అనుకుంటుంది. ఎవరు లేరు సర్ అని రాజనర్స్ చెప్తుంది. కృష్ణకి గది ముందు ఎవరివో అమ్మాయి చెప్పులు కన్పించాయట అని మురారి అడుగుతాడు. లేదు సర్.. ఒక మేడం భవాని తాలూకూ ఒక రోజు వచ్చి వెళ్లిపోయింది.. ఆవిడే ఆ చెప్పులు మర్చిపోయి ఉంటుందని రాజనర్స్ చెప్పి వెళ్ళిపోతుంది. మురారికి మాత్రం రాజనర్స్ ఏదో దాస్తూన్నట్లు అనిపిస్తుంది. ఏది ఏమైనా సరే కృష్ణకి దగ్గర అవడానికె ట్రై చేస్తానని మురారి అనుకుంటాడు. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి మురారి వస్తాడు. నీకు స్విమ్మింగ్ వచ్చా కృష్ణ అని మురారి అడుగుతాడు. రాదు అంటే ఎక్కడ చులకన అవుతానో‌ అని కృష్ణ వచ్చని చెప్తుంది. సరే రేపు ఉదయం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్దామని మురారి అంటాడు. ఆ తర్వాత కృష్ణ అనవసరంగా అబద్ధం చెప్పనా అని టెన్షన్ పడుతుంది.

మరొక వైపు ముకుంద చెప్పకుండా వెళ్లింది. వెళ్తున్నా అని నాకు చెప్తే బాగుండేది కదా అని రేవతి ఆలోచిస్తుంది.. అప్పుడే అలేఖ్య వచ్చి అత్తయ్య రీల్స్ తీద్దామా అని అడుగుతుంది. రేవతికి కోపం వచ్చి నీకు రీల్స్ కావాలా అని అలేఖ్య చెవి మెలివేస్తుంది. మరొక వైపు స్విమ్మింగ్ దగ్గరికి కృష్ణ, మురారి వస్తారు. ఇప్పుడు వద్దు ఏసీపీ సర్ అని కృష్ణ అంటుంది. ఇప్పుడే చెయ్యాలని మురారి అంటాడు. ఆ తర్వాత మురారిని కృష్ణ వాటర్ లో నెట్టి వేస్తుంది. కాసేపటికి కృష్ణ చెయ్యి పట్టుకొని మురారి వాటర్ లోకి లాగేస్తాడు. సర్ నాకు స్విమ్మింగ్ రాదని కృష్ణ అరుస్తుంటే మురారి వెళ్లి కాపాడతాడు. కృష్ణని ఎత్తుకొని మురారి తీసుకొని వెళ్తుండగా ముకుంద ఎదురుపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.